ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది.అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ త్వరలో డీఎస్సీ 2020 నోటిఫికేషన్ విడుదల కానుందని కీలక ప్రకటన చేసింది.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
డీఎస్సీ 2020కు ఎటువంటి అడ్డంకులు లేవని ఆయన చెప్పారు.
మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డీఎస్సీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.టెట్ కు కొత్త సిలబస్ ను విడుదల చేస్తామని.
మారుతున్న విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారుతుందని పేర్కొన్నారు.డీఎస్సీ 2018 ఎస్జీటీ అభ్యర్థులకు కోర్టు పెండింగ్ లో ఉన్న కేసును కొట్టివేయడం వల్ల నియామక ప్రక్రియను ప్రారంభించామని అన్నారు.
2018 డీఎస్సీకి సంబంధించిన 3524 పోస్టులకు ప్రస్తుతం నియామక ప్రక్రియ జరుగుతోంది.ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వనుంది.ఈ పోస్టుల భర్తీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం టెట్, 2020 డీఎస్సీ దిశగా అడుగులు వేయనుంది.2018 డీఎస్సీ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ నుంచి వారికి కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది.
మరోవైపు రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలలో విద్యార్థుల ప్రవేశానికి సంబంధించి ఈరోజు తుది నిర్ణయం తీసుకోబోతున్నామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.ఉపాధ్యాయుల బదిలీల గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని.
ఇంటర్ సిలబస్ ను కుదించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.ఇప్పటికే జగనన్న విద్యా దీవెన కిట్లు ప్రభుత్వ పాఠశాలలకు చేరాయని.
లాక్ డౌన్ సమయంలో ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.జగన్ సర్కార్ నుంచి డీఎస్సీ గురించి కీలక ప్రకటన వెలువడటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.