ప్రధాని పుట్టినరోజు సందర్భంగా మోడీపై ట్రంప్ ఏమని ట్వీట్ చేశాడంటే...?!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మధ్య వున్న స్నేహ సంబంధం గురించి అందరికీ తెలిసినదే.

మోడీ 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

పలు దేశాల అధి నేతలు ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ క్రమంలోనే.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చాలా విశేషంగా తెలియజేశారు. "నాకు, మా అమెరికాకు మంచి మిత్రుడు అయినటువంటి, గొప్ప నాయకత్వ లక్షణాలు వున్న మా మోడీకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

" అంటూ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీపై విశేషంగా ప్రశంసలు కురిపించారు.ఇకపోతే.

Advertisement

మిగతా దేశాధి నేతలు కంటే అమెరికా అధ్యక్షుడు కొంచెం ఆలస్యంగా విషెస్ చెప్పడం గమనార్హం.ఎందుకంటే, భారత్‌తో పోల్చితే అమెరికా కాలమానం తొమ్మిదిన్నర గంటలు ఆలస్యంగా ఉంటుంది కనుక.

ఈ క్రమంలో ట్రంప్ సెప్టెంబరు 18వ తేదీన మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్లు చాలా మంది పొరబడతారు.కానీ అగ్రరాజ్యం అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబరు 17వ తేదీనే డొనాల్డ్ ట్రంప్ తన మిత్రునికి ట్వీట్ చేయడం జరిగింది.

అలాగే, తన పుట్టిన రోజుని పురస్కరించుకొని ప్రధాని మోడీ ప్రజలకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసారు కూడా.తనకు పుట్టిన రోజు కానుకను ఇస్తామని అడిగిన ప్రజలను ఉద్దేశించి.

మోడీ "మాస్క్ ధరించి, సామాజిక దూరాన్ని పాటించండి.అలాగే రద్దీగా వున్న ప్రదేశాలను విస్మరించండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి, మీ రోగనిరోధక శక్తిని ఇనుమడింప చేసుకోండి." అని తన జాతికి పిలుపుని ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు