దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.దేశంలో కరోనా విజృంభిస్తున్నా రికవరీ రేటు కూడా అధికంగానే ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా బాధితులకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ వైరస్ బారిన పడిన వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కరోనా నుంచి కోలుకోవడానికి కాస్తా ఎక్కువ సమయం పడుతుందన్నారు.
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ బాధితుల్లో కొన్ని రోజుల పాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కరోనా నుంచి కోలుకున్న బాధితులు హోం క్వారంటైన్ కొద్ది రోజుల వరకు ఉండి అలసత్వం వహించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు.
తరచూ గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ ను పరీక్షించుకోవాలని సూచించారు.హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న బాధితుల్లో జ్వరం, శ్వాస సమస్య, గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఆస్పత్రికి సంప్రదించాలన్నారు.
కరోనాతో క్యూర్ అయిన వారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలన్నారు.దీని వల్ల కరోనాపై ఉన్న అపోహలు తొలిగే ఆవశ్యకత ఉందన్నారు.రోజూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజికదూరం తప్పనిసరిగా పాటించాలన్నారు.వీటితో పాటు తరచూ గోరు వెచ్చటి నీటిని తాగాలని సూచించారు.