'ఆదిపురుష్‌' కోసం ప్రభాస్‌ వర్కింగ్‌ డేస్‌ ఎన్నో తెలుసా?

ఒక వైపు రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి చేయలేదు ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాకు అధికారికంగా ఓకే చెప్పాడు.

ప్రకటన వచ్చింది హీరోయిన్‌గా బాలీవు్డ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునేను కూడా ఎంపిక చేయడం జరిగింది.

వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఆ సినిమాను షూటింగ్‌ మొదలు పెడతామంటూ చాలా నమ్మకంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నాడు.ఇదే సమయంలో భారీ బడ్జెట్‌ మూవీ ఆదిపురుష్‌ ను కూడా ప్రభాస్‌ కమిట్‌ అయిన విషయం తెల్సిందే.

మూడు సినిమాలను ఇంత తక్కువ సమయంలో చేయడం అది కూడా వందల కోట్ల ప్రాజెక్ట్‌లను ఇంత స్పీడ్‌గా చేయడం సాధ్యమేనా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుండగా అసలు విషయాన్ని క్లారిటీగా చెప్పేందుకు ఆది పురుష్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా కామెంట్స్‌ చేశారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2021 జనవరి నుండి ఆదిపురుష్‌ షూటింగ్‌ జరుగబోతుంది.

ఈ సినిమా షూటింగ్‌ కేవలం 150 రోజులు మాత్రమే జరుగబోతుంది.అందులో ప్రభాస్‌ షూటింగ్‌ లో పాల్గొనబోతున్నది 70 నుండి 80 రోజులు మాత్రమే అంటున్నారు.

Advertisement

సినిమాను జనవరి ఉండి మే వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారట.ఆ తర్వాత కనీసం ఆరు నుండి పది నెలల పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కు సంబంధించిన వర్క్‌ కొనసాగబోతుంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఆదిపురుష్‌ రూపొందించే పనిలో దర్శకుడు ఓం రౌత్‌ ఉన్నాడు.ప్రభాస్‌ ఆదిపురుష్‌కు గాను వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆయనకున్న క్రేజ్‌ కు అది తక్కువ పారితోషికమే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 70 నుండి 80 రోజుల షూటింగ్‌ లో పాల్గొన్నందుకు గాను ప్రభాస్ తీసుకోబోతున్న పారితోషికం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది.

ప్రభాస్‌ ఖచ్చితంగా ఆదిపురుష్‌ తో సంచలనంగా నిలవడం ఖాయం అని అందుకే ఆయన కాస్త రిస్క్‌ అయినా ఈ సమయంలో సినిమాకు ఓకే చెప్పాడని అంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు