నటుడు జయప్రకాష్ రెడ్డి తీరని కోరిక ఇదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మాత్రమే సొంతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో జయప్రకాశ్ రెడ్డి ఒకరు.

ప్రేమించుకుందాం రా సినిమాతో నటుడిగా జయప్రకాష్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది.

కరోనా, లాక్ డౌన్ వల్ల గత కొంతకాలంగా గుంటూరులో ఉంటున్న జయప్రకాష్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా శిరివెళ్ల.ఎక్కువగా ఫ్యాక్షన్ సినిమాలలో విలన్ గా నటించిన జయప్రకాష్ రెడ్డి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మరికొన్ని సినిమాల్లో కమెడియన్ గాను నటించారు.

రాయలసీమ యాసతో సినిమాల్లో సందడి చేసిన జయప్రకాష్ రెడ్డి చివరగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు.సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలు విలన్ గా జయప్రకాష్ రెడ్డికి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి.అయితే వినాయక్, శ్రీనువైట్ల లాంటి దర్శకులు మాత్రం జయప్రకాష్ రెడ్డిలోని కామెడీని హైలెట్ చేస్తూ సినిమాలు తీశారు.74 ఏళ్ల వయస్సులోనూ నటుడిగా ఆయనకు అవకాశాలకు కొదువే లేదు.జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లోకి రాకముందు జయప్రకాశ్ రెడ్డి టీచర్ గా పని చేశారు.జయప్రకాష్ తండ్రి కూడా రంగస్థలంపై నాటకాలు వేసిన వాళ్లే కావడంతో జేపీకి బాల్యం నుంచే రంగస్థలంపై ఆసక్తి ఉంది.

Advertisement

జేపీ తండ్రి సీఐగా పని చేసి రిటైర్ అయ్యారు.జేపీకి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా ఉద్యోగం రాగా ఆ ఉద్యోగంలో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు.

తన కొడుకు లంచాలు తీసుకునే ఉద్యోగం చేయకూడదని జేపీ తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే జేపీ తండ్రి మరణించిన సమయంలో ఒక కోరిక మాత్రం తీరలేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

తాను సక్సెస్ సాధించినా తండ్రిని బైక్ పై కూర్చోబెట్టి తిప్పలేకపోయానని జయప్రకాష్ పలు సందర్భాల్లో చెప్పారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు