లీకులతో వీక్ అవుతున్న వైసీపీ ? చివరకు ఆ రహస్యాలూ బయటకి ..?

ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు నడిపించే క్రమంలో ఎన్నో కీలక నిర్ణయాలు అంతర్గతంగా తీసుకుంటూ ఉంటారు.ఇందులో కొన్ని బహిరంగంగా వెల్లడించేవి ఉంటాయి.

మరి కొన్ని కొంతమంది మధ్య మాత్రమే రహస్యంగా ఉంటాయి.కానీ అత్యంత రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలు పార్టీ కీలక నాయకులకు తెలియక ముందే మీడియాకు లీక్ అయిపోతుండడం ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా గా పేరు పొందిన కొన్ని ఛానళ్లు, పత్రికలకు ఏపీ క్యాబినెట్ లో రహస్యంగా తీసుకున్న నిర్ణయాలపై ఎవరికి తెలియక ముందే సదరు మీడియాకు తెలిసిపోతుండడం, అవి ప్రధాన వార్తలుగా రావడం, వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టడం కొంత కాలంగా జరుగుతూ వస్తోంది.ఈ వ్యవహారాలను జగన్ సీరియస్ గానే తీసుకున్నారు.

ఇప్పటికే మీడియాకు లీకులు ఇస్తున్నారనే అనుమానంతో ఒకరిద్దరు మంత్రులకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి గాని, పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలు, అసంతృప్తులపై గాని మీడియాకు సమాచారం ముందుగా అందడం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తుంది ఏమి కాదు.

Advertisement

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల గురించి వైసిపి మీడియా కు ముందే సమాచారం తెలిసినా, ఆ పార్టీకి అనుకూలంగానే వాటికి సంబంధించిన కథనాలు ప్రచారం అవుతున్నాయి.కానీ వైసీపీని బద్ధ శత్రువుగా చూస్తున్న కొన్ని టీడీపీ అనుకూల మీడియా గా పేరుపడ్డ పత్రికలు, చానళ్లకు మాత్రం, ఈ విషయాలపై ముందుగా సమాచారం అందితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేసి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు కాకుండా అన్ని రకాల ఎత్తుగడలు వేస్తూ, వాటిని జనాల్లోకి తీసుకువెళ్లి హడావుడి చేస్తుంటాయి.

ఇప్పుడు ఆ విధంగానే కొన్ని విషయాలకు సంబంధించి మీడియాకు లీకులు అందటంపై జగన్ సీరియస్ గానే తీసుకొని, ఈ సంఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.అసలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలతో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు సన్నిహితంగా మెలగాలి అనే విషయంపైన దృష్టి పెట్టి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే కొంతమంది అధికారుల పాత్రపైన కూడా రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ విషయంలో జగన్ సీరియస్ గానే దృష్టిపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు