రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది.రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
అన్ లాక్ ప్రక్రియ మొదలుకావడంతో వలసకూలీలు నగరబాట పట్టారు.కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేపథ్యం ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సెప్టెంబర్ నుంచి అన్ లాక్-4.0తో రాష్ట్రంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు లక్షకు పైగా దాటాయి.
తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,932 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,415కు పెరిగింది.నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందగా.
ఆ సంఖ్య 799కి చేరింది.ఇప్పటివరకు 87,675 మంది కరోనా నుంచి క్యూర్ అయి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 28,941 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.అయితే జిల్లాల ప్రకారం రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 520, రంగారెడ్డిలో 218, కరీంనగర్ లో 168, నల్గొండలో 159, ఖమ్మంలో 141, నిజామాబాద్ లో 129, సూర్యపేటలో 102 కేసులు నమోదయ్యాయి.







