ఓ కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆ నేత పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీ అంతర్గత విషయాలపై లేఖ రాశారు.దీనిపై సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం తర్వాత గులాంనబీ ఆజాద్ తీవ్రస్థాయిలో విమర్శలకు గురయ్యాడు.పార్టీ అధిష్టానం నిలదీసేలా మాట్లాడటంతో మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది.
ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేఖను ఎందుకు రాశావని నిలదీశారు.లేఖను సమావేశంలో చదివిన ఆయన అందరి సమక్షంలోనే బీజేపీతో సంబంధాలు ఉన్నట్లు రుజువైతే రాజీనామా చేస్తానని ప్రకటించుకున్నారు.
అయితే పార్టీ తొలగించకన్న ముందే ఆజాద్ రాజీనామా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పార్టీ అధిస్టానం చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేశారా ? లేదా బీజేపీ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అనే దానిపై స్పష్టత లేదు.రాజీనామా చేసిన విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుందని పలువురు ఆరోపిస్తున్నారు.