1100 ఏళ్ల పురాతనమైన నాణేలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.తొలి ఇస్లామిక్ నాణేలను ఇజ్రాయిల్ ఆంటిక్విటీస్ అథారిటీస్ పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
యువ వాలంటీర్ల సాయంతో తవ్వకాలు ప్రారంభించిన పురావస్తు శాస్త్రవేత్తలకు వందల కొద్ది నాణేలు బయట పడ్డాయి.ఇజ్రాయిల్ దేశంలోని జెరూసలేం యావ్నే సమీపంలో సాల్వేజ్ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించారు.అందులో 425 బంగారు నాణేలు కనుగొన్నట్లు ఇజ్రాయిల్ పురావస్తు శాస్త్రవేత్తలు సోమవారం ప్రకటించారు.1,100 ఏళ్ల కిందట ఉన్న అబ్బాసిద్ కాలానికి చెందిన ఈ నాణేలను గుర్తించినట్లు ప్రకటించారు.తొలి ఇస్లామిక్ నాణేలని ఇజ్రాయిల్ ఆంటిక్విటీస్ అథారిటీస్ ఆధ్వర్యంలో పురావస్తు శాస్త్రవేత్తలు లియాత్ నడావ్-జివ్, ఎలీ హడ్డాడ్ తో పాటు యువ వాలంటీర్లతో కలిసి తవ్వకాలు ప్రారంభించారు.తవ్వకాలు జరుపుతుండగా 425 బంగారు నాణేలు గుర్తించారు.
తవ్వకాల అనంతరం నిపుణుడు రాబర్ట్ కూల్ మాట్లాడుతూ.‘‘ ఇజ్రాయిల్ లో 425 బంగారు నాణేలు వెలువడ్డాయి.
దేశంలోనే ఇంత మొత్తంలో అత్యంత పురాతనమైన నాణేలు ఎక్కడ దొరకలేదు.ఇదే మొదటిసారి.
ఈ నాణేలు 9వ శతాబ్దం చివరికాలం నాటి నాణేలు.అయితే 2015వ సంవత్సరంలో 10, 11వ శతాబ్దంలోని ఫాతిమిడ్ కాలానికి చెందిన నాణేలు గుర్తించారు.
పురాతన నగరమైన కైసర్ తీరంలో సుమారు 2 వేల నాణేలను కనుగొన్నారు.’’ అని చెప్పుకొచ్చాడు.
యువ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న నాణేల గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఇజ్రాయిల్ ఆంటిక్విటీస్ అథారిటీస్ పురావస్తు శాస్త్రవేత్తలు లియాత్ నడావ్-జివ్ , ఎలీ హడ్డాడ్ కలిసి ప్రకటించారు.
ఈ మేరకు నాణేలను అక్కడ ప్రభుత్వ మ్యూజియానికి తరలించారు.భారీ సంఖ్యలో నాణేలు వెలువడటంతో పరిశోధకులు మరింత రెట్టింపుతో తవ్వకాలు ప్రారంభించారు.
అబ్బాసిద్ కాలానికి చెందిన బంగారం దొరకడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.







