వైరల్ ఫోటో: అయోధ్యలో హనుమంతుడి రూపంలో మోదీ!

ఎన్నో కోట్లమంది హిందువుల కల నెరవేరిన రోజు నిన్న.చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా మిగిలిన రోజు నిన్న.

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ నిన్న బుధువారం శ్రీకారం చుడుతూ భూమి పూజా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామమందిరం స్థలానికి సమీపంలో ఉన్న 10వ శతాబ్దం నాటి హనుమంతుడి ఆలయంలో పూజలు నిర్వహించారు.పారిజాతం మొక్కను నాటి మధ్యాహ్నం 12.44 నిమిషాలకు వెండి ఇటుకను ప్రధాని మోదీ ప్రతిష్టించారు.అయితే ఆ సమయంలో తీసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఎందుకంటే ప్రధాని మోదీ అచ్చం హనుమంతుడిలా ఉన్నారు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మీరు చుసిన నిజంగానే అలానే ఉన్నాడు అని అంటారు.

అలా ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ప్రధాని మోదీ కరోనా వైరస్ నేపథ్యంలో నోరు, ముక్కుకు మాస్కును ధరించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

అయితే మోదీ తలపై కిరీటాన్ని పెడుతున్న సందర్భంలో తీసిన ఫొటోలో అయన రెండు చేతులు జోడించి కనిపించరు.మాస్కు ధరించి ఉన్న మోదీ సాక్షాత్తు హనుమంతుడిలా కనిపించి అతడే శ్రీరాముడుకు నమస్కరిస్తున్నాడు అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలు మీరు చుసిన అంటే అదే అంటారు.కాగా సరిగ్గా 28 ఏళ్ళ క్రితం ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి వెళ్లారు.ఇప్పుడు ప్రధాని హోదాలో మోదీ అయోధ్యకు రావడం గమనార్హం.28 ఏళ్ళ క్రితం మోదీ అయోధ్యలో తీయించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు ఈ ఫోటోను వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు