తమాషాగా ప్రెగ్నెన్సీ కిట్ తో పరీక్ష చేసుకున్నాడు... పాజిటివ్ రిజల్ట్ వచ్చింది... ఆపై ఏం జరిగిందంటే...?!

ఈ మధ్యకాలంలో మహిళలు గర్భం దాల్చారో లేదో అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఆసుపత్రులకు పరుగులు తీయకుండా, ఇంట్లోనే ఉండి పరీక్షలు చేసుకునే వెసులుబాటు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇందుకోసం హోం ప్రెగ్నెన్సీకి కిట్స్ ఉపయోగపడుతున్నాయి.

ఈ కిట్ ద్వారా ఉదయాన్నే మహిళ యూరిన్ సేకరించి ఒక చిన్న డ్రాప్ అందులో వేస్తే అందులో ఉండే హార్మోన్ల ద్వారా కిట్ ప్రెగ్నెన్సీ ని తెలియజేస్తుంది.ఇక దీంతో మహిళలు గర్భవతి అయ్యారో లేదో చాలా సులువుగా తెలుసుకోవచ్చు.

ఈ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా ఒక ప్రాణం నిలబడింది అని చెప్పవచ్చు.అది ఆలా అంటే.

తాజాగా ఓ వ్యక్తి తన ప్రియురాలు తన రూమ్ లో వదిలివెళ్లిన ప్రెగ్నెన్సీ కిట్ ను పరీక్ష చేద్దామనుకుని, అందులో తన యూరిన్ డ్రాప్ వేసి చెక్ చేసాడు.అయితే తాను అనుకోని విధంగా కాకుండా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది.

Advertisement

ఇక అంతే, అది చూసిన సదరు వ్యక్తి షాక్ లోనయ్యాడు.అయితే ఈ విషయాన్ని ముందుగా జోక్ గా భావించిన వ్యక్తి తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

ఆ విషయాన్ని సోషల్ మీడియాలో చదివిన కొందరు ఎందుకైనా మంచిది తనని ఓసారి డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.దాంతో ఆ వ్యక్తి వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, అందరూ అనుకున్న విధంగానే అతనికి వృషణంలో క్యాన్సర్ కు సంబంధించిన గడ్డ ఒకటి తయారవుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

అయితే అదృష్టవశాత్తు అదికాస్తా మొదటి దశలోనే ఉందని.దానిని సులువుగా తగ్గించవచ్చని అతనికి ధైర్యం చెప్పారు వైద్యులు.

దీంతో ప్రస్తుతం ఆ వ్యక్తి క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.అయితే ఒక మహిళ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పురుషుడి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్ రావడం అన్న సంగతి గురించి వైద్యులను అడగగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వృషణాల క్యాన్సర్ ఉన్నవారికి విడుదలయ్యే హార్మోన్లు, ఆడవారికి గర్భం వచ్చినప్పుడు విడుదలయ్యే హార్మోన్లు దాదాపుగా ఒకటే ఉంటాయని వైద్య నిపుణులు తెలియజేశారు.అందుచేతనే అతనికి ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్ తేలిందని తెలియజేశారు.

Advertisement

ఒకవేళ తాను ఆ ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా చెక్ చేసుకోకపోయి ఉంటే నిజంగా అతనికి ప్రాణాపాయ స్థితి ఏర్పడేది.

తాజా వార్తలు