తన బయోపిక్ తానే తీస్తా అంటున్న ఒకప్పటి స్టార్ హీరో

ఏ రంగంలో అయిన ఉన్నత స్థానంకి వెళ్ళిన వారు ఒకప్పుడు తన జీవిత కథలని పుస్తకాల రూపంలో రాసుకునేవారు.వాటిని ఆటోబయోగ్రఫీ అనేవారు.

లేదంటే వేరొక రచయిత ఒక ప్రముఖ వ్యక్తి జీవిత కథని పుస్తక రూపంలో తీసుకొస్తే బయోగ్రఫీ అనేవారు.ఒకప్పుడు వాటికి మంచి డిమాండ్ ఉండేది.

పుస్తక ప్రియులు ఆ ప్రముఖుల జీవిత కథలు చదవడానికి ఆసక్తి చూపించే వారు.అయితే ఇప్పుడు సినిమా ప్రాధాన్యత పెరిగింది.

ఒక విషయం పుస్తకరూపంలో కంటే దృశ్య రూపంలో ఎక్కువ కాలం ఉంటుందనే విషయం చాలా మందికి అర్ధమైంది.దీంతో బయోగ్రఫీలు కాస్తా బయోపిక్ సినిమాలు అయ్యాయి.

Advertisement

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది బయోపిక్ కథలు తెరపైకి వస్తున్నాయి.ఈ మధ్య కాలంలో బయోపిక్ కథలకి మరీ డిమాండ్ ఎక్కువైంది.

హిందీలో బయోపిక్ స్టోరీలు సూపర్ హిట్ అవుతున్నాయి.సౌత్ లో ఒక్క మహానటి సినిమా మాత్రమే ప్రేక్షకులని మెప్పించింది.

అయిన కూడా బయోపిక్ సినిమాలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.ఒకప్పటి స్టార్ హీరో, ప్రేమకథా చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న తమిళ హీరో కార్తిక్ తన బయోపిక్ ని తెరకెక్కిస్తానని చెప్పారు.

ఈ సినిమాలో తన కొడుకు హీరోగా నటిస్తాడని కూడా ప్రకటించాడు.ఇక తన బయోపిక్ సినిమాలో తన సినిమా జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాలు తెలియజేస్తా అని చెప్పాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

మరి అతని బయోపిక్ ఎంత వరకు ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు