వైసీపీని భయపెడుతున్న రాజుగారు ? పార్టీ రద్దు అవుతుంది అంటూ...?

నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మామూలుగా లేదు.

పార్టీపై ఆయన తిరుగుబావుటా ఎగురవేసి రోజుకో సంచలన విషయం బయట పెడుతూ, ఆ పార్టీ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

ఇప్పటికే పార్టీపైన, అధినేత జగన్ వ్యవహారశైలి పైన అనేక విమర్శలు రఘురామకృష్ణం రాజు చేశారు.దీనిపై ఆగ్రహం చెందిన పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది.

దానికి కౌంటర్ గా రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో ఇప్పుడు వైసీపీ పై విమర్శలు చేయడమే కాకుండా, నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ పై అనేక ఫిర్యాదులు చేశారు.తనకు పార్టీ జారీచేసిన షోకాజ్ నోటీసు చెల్లుతుందా లేదా అనే క్లారిటీ కూడా ఆయన కోరినట్లు తెలుస్తోంది.

అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఎలా జారీ అలా చేస్తారని, ఆయన పార్టీని ఇప్పటికే ఎదురు ప్రశ్నించారు.అక్కడితో ఆగకుండా, ఈ రోజు కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర వైసీపీ పై అనేక ఫిర్యాదులు చేసి, అనే క్లారిటీ లు తెచ్చుకునే విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రద్దు కాబోతోంది అంటూ పరోక్షంగా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.వైసీపీకి వ్యతిరేకంగా ఉండే కొన్ని మీడియా చానళ్లను పిలిపించుకుని పదేపదే ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీని కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీకి ముప్పు ఉందని, రద్దయ్యే అవకాశం ఉందనే సంకేతాలను ఈ సందర్భంగా ఆయన ఇస్తున్నారు.అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనల మేరకు ఏర్పడలేదని, ఆ విధంగా నడపడం లేదని ఎన్నికల సంఘం సూచించిన నియమాలను పాటించడం లేదని, రఘురామకృష్ణంరాజు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే సాక్ష్యాలను కూడా ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.ఆయన ఆషామాషీగా అయితే, ఆరోపణలు చేయడం లేదని, బలమైన సాక్ష్యాలను సేకరించుకుని ఇప్పుడు వైసీపీ పై విరుచుకు పడుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా వైసీపీ కూడా అదే స్థాయిలో ఆయనను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.త్వరలోనే రఘురామకృష్ణంరాజు కు అనర్హత వేటుకు గురవుతారని, గతంలో రాజ్యసభ సభ్యుడిగా శరద్ యాదవ్ పై అనర్హత వేటు వేసిన అంశాన్ని కూడా వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ రఘురామకృష్ణంరాజు కు కౌంటర్ ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఆయన మాత్రం తన దూకుడు తగ్గించుకునేలా కనిపించడం లేదు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు