స్మృతి ఇరానీ పేరు ఇప్పుడు దేశంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.బీజేపీ మోడీ సర్కార్ లో యూనియన్ మంత్రిగా, అత్యంత కీలకమైన నేతలలో ఒకరుగా ఆమె ఉన్నారు.
మోడీని ఎక్కువగా గౌరవించే వ్యక్తుల జాబితాలో స్మృతి ఇరానీ పేరు కూడా ఉంటుంది.అందుకే ఆమెకి ప్రధాని మోడీ అత్యున్నత పదవులు ఇచ్చి సత్కరించారు.
ఇక గత ఎన్నికలలో ఏకంగా గాంధీ ఫ్యామిలీకి కంచుకోట అయిన అమేధీలో ఏకంగా కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ మీద పోటీ చేసి గెలిచింది.అత్యంత ప్రభావశీల మహిళగా ఆమె దేశ రాజకీయాలలో ఉంది.అయితే ఆమె తన ప్రస్తానం మొదలు పెట్టింది మోడల్ గా అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
1998లో మిస్ ఇండియా పోటీలలో స్మృతి ఇరానీ పాల్గొంది.ఆ పోటీలలోనే తనకి రాజకీయాల మీద ఉన్న మక్కువని తెలియజేసింది.దేశం కుల, మత, ప్రాంతాల సమ్మేళనం అని నమ్మే నాకు రాజకీయాలు అంటే ఇష్టం అంటూ ఆమె మిస్ ఇండియా పోటీలలో మాట్లాడి, ర్యాంప్ వాక్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఈమె మోడలింగ్ రంగం నుంచి సినిమాలలోకి ప్రవేశించింది, అక్కడ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యింది. తరువాత పలు హిందీ సీరియల్స్ లో కూడా నటించింది.
అదే సమయంలో బీజేపీలో యాక్టివ్ మెంబర్ గా ఉండేది.ఆమె మిస్ ఇండియా పోటీలకి సంబందించిన వీడియోని నిర్మాత ఏక్తా కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.