ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక శాతం అమెరికాలో నమోదు అవుతున్న విషయం తెల్సిందే.అమెరికాలో కేసుల సంఖ్య మరణాల సంఖ్య భయంకరంగా ఉంది.
అక్కడ ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుందనే ఉద్దేశ్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాక్‌డౌన్‌కు ఆసక్తి చూపించలేదు.పరిస్థితి చేతులు దాటిన తర్వాత లాక్‌డౌన్‌కు సిద్దం అయ్యారు.
అమెరికాలో ప్రస్తుతం జనజీవనం స్థంభించి పోయింది.అక్కడ పెద్ద ఎత్తున ఆర్థికపరమైన నష్టాలను వ్యాపారస్తులు చవిచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.దేశంలో పరిస్థితి కుదుట పడుతోంది.త్వరలోనే మళ్లీ యదాస్థితికి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.త్వరలోనే వ్యాపార కార్యక్రమాలు మొదలు కాబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.
దేశం సురక్షితం అవుతోంది.మనకు ఎంతో ప్రియమైన వృద్దులను జాగ్రత్తగా చూసుకుందాం, వారిని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటిద్దామంటూ ట్రంప్ పేర్కొన్నాడు.
అదే ట్వీట్ లో వృద్దుల్లోంచి తనను మినహాయింపు ఇవ్వాలంటూ సరదాగా కామెంట్ చేశాడు. అక్కడ పరిస్థితి అదుపులోకి రాకముందే మళ్లీ వ్యాపారాలను ప్రారంభిస్తారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.








