కరోనా దెబ్బకు అమెరికా లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు ఒకవైపు అమెరికా ఆర్థిక పరిస్థితి కుదేలై పోతుంటే మరొకవైపు, అమెరికానే నమ్ముకుని పెట్టిన కంపెనీలు వ్యాపారాలు చేయలేమంటూ చేతులెత్తేస్తునాయి.ప్రస్తుతం అమెరికాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
అయితే కరోనా ప్రభావం అమెరికాలో కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమై ఉండగా ఆయా ప్రాంతాలలో లో షట్ డౌన్ వలన ఎన్నో కంపెనీలు మూతపడి పోయాయి.ఈ నేపథ్యంలో సదరు కంపెనీలో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి అంధకారంలో పడింది.
ట్రంప్ తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ సంస్కరణల కారణంగా ఏదో ఒక చోట పని చూసుకుని బయట పడే పరిస్థితులు ప్రస్తుతం అమెరికాలో ఎక్కడా కనిపించడం లేదు.ఈ పరిస్థితుల్లో తిరిగి భారతదేశం వెళ్ళిపోదామా అంటే తిరిగి వెళ్లడానికి విమానయాన సౌకర్యాలు కూడా లేవు దాంతో వివిధ రంగాలలో ఉద్యోగాలు చేసుకునే భారత నిపుణలు ఏమి చేయాలో తెలియక ఉద్యోగాలు లేక, కనీస నిత్యవసరాలు లేక అల్లాడిపోతున్నారు.

మరోవైపు కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడితే లక్ష ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ ప్రభావం ముఖ్యంగా వలస ఉద్యోగులైన భారతీయులపై అత్యధికంగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.ఎందుకంటే అమెరికాలో వృత్తి నైపుణ్య హెచ్-1బి వీసా పై పనిచేసే అత్యధికులు భారతీయులే ఈ కారణంగా ముందుగా అమెరికా నుంచీ కాలు బయటపెట్టాల్సి వస్తే భారతీయులే బయటకి వస్తారని అంటున్నారు నిపుణులు.