వారిద్దరూ ఏపీలో ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదా ?

కరోనా మహమ్మారి

ని ఎదుర్కొనేందుకు రెండు

తెలుగు రాష్ట్రాలు

గట్టిగానే చర్యలు తీసుకుంటున్నాయి ఈ విషయంలో రెండు ప్రభుత్వాలను విమర్శించేందుకు ఎటువంటి ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పని చేస్తున్నాయి.

ఈ ఆపద సమయంలో ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది.

అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ సమయంలో ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తూ, ఉమ్మడిగా ప్రజలకు మేలు చేసే విషయంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.కేరళలో ఇటువంటి ప్రయత్నమే జరిగింది.ప్రజల్లో భరోసా కల్పించేందుకు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం పార్టీల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు అందించారు.

అన్ని రాష్ట్రాలు పాటించాలని సూచనలు కూడా అందాయి.ఇప్పుడు నిజంగానే విపత్కర సమయం.

రాజకీయ పార్టీలు

వీలైనంత ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది.

అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత

చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

ఇద్దరూ ఇప్పుడు ఏపీలో అందుబాటులో లేరు.వీరిద్దరు

హైదరాబాదు

లో ఉన్నారు.

Advertisement

వీరు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ప్రజల్లో భరోసా కల్పించేందుకు వీరిద్దరికీ అవకాశం లేకుండా పోయింది.అప్పట్లో వైసిపి ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను ఉద్దేశించి ఆయన హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ టిడిపి, జనసేన పార్టీ విమర్శలు చేశాయి.

ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.

జనసేన అధినేత ,

టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీ విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో తెలంగాణలోనే ఉండిపోయారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి చంద్రబాబు

హైదరాబాద్

లోనే ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రతి వారం శుక్రవారం హైదరాబాద్ కు వెళ్తున్న చంద్రబాబు మళ్లీ సోమవారం వరకు ఏపీ ముఖం చూడడం లేదు.

ఇక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అయితే సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం లేక, హైదరాబాదులో ఇంట్లోనే పరిమితమవుతూ ఏపీ రాజకీయాల్లో అప్పుడప్పుడు మాత్రమే వేలు పెడుతున్నారు.వైరస్ కారణంగా ప్రభుత్వం మార్చి 22వ తేదీ ఆదివారం పిలుపునిచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

అయితే ఆ సమయానికి చంద్రబాబు పవన్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉండి పోయారు.రాష్ట్ర సరిహద్దులను కూడా ఇప్పుడు మూసివేయడంతో వీరిద్దరు

హైదరాబాద్

నుంచి కాలు మోపేందుకు ఆస్కారం లేకుండా పోయింది.

Advertisement

అంతేకాకుందా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా ఏపీకి వస్తానంటే 14 రోజులు వారిని తప్పనిసరిగా క్వారంటైన్ చేయాలి అంటూ ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు.దీంతో వీరిద్దరు హైదరాబాద్ నుంచి మాత్రమే ఏపీ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు .ఇక

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ వాలంటీర్

లను ఉద్దేశించి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.కానీ ఈ విపత్కర సమయంలో విమర్శలు చేసేందుకు టిడిపి అంత ఆసక్తి చూపించలేదు.

కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో

టీడీపీ అధినేత ,జనసేన అధినేత

ఇద్దరు ఉండి ఉంటే ఏపీలో మరింతగా ప్రజలకు అవగాహన కల్పించడం , ప్రభుత్వ తీరు మెరుగుపడే విధంగా సూచనలు ఇచ్చే విషయంలో నూ యాక్టివ్ రోల్ పోషించి ఉండేవారు అనే వాదనలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి.

తాజా వార్తలు