సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్... కరోనాపై సెలబ్రిటీస్ ప్రచారం

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో డిఫరెంట్ చాలెంజ్ కాన్సెప్ట్ లు ట్రెండ్ అవుతున్నాయి.

వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని మాత్రం ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఉంటున్నాయి.

కొద్ది రోజుల క్రితం వరకు సేవ్ అ ట్రీ చాలెంజ్ నడిచింది.ఈ చాలెంజ్ లో చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చాలెంజ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.అదే సేఫ్ హ్యాండ్స్ అనే ఛాలెంజ్.

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతూ ఉండటంతో అలాంటి వైరస్ దరిచేరకుండా రక్షణ చర్యలు తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.దీనిని మరింత విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్‌ టెడ్రోస్ స‌రికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చారు.

Advertisement

ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన వారు చేతుల‌ని శుభ్రంగా క‌డుక్కోవ‌డంతో పాటు మ‌రో ముగ్గురు లేదా న‌లుగురికి ఛాలెంజ్ విస‌రాలి.టెడ్రోస్ బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణేకి సేవ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విసిరారు.

ఈ ఛాలెంజ్ స్వీక‌రించిన అమ్మ‌డు చేతుల‌ని స‌బ్బుతో శుభ్రంగా క‌డుక్కుంటున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.ఈ చాలెంజ్ కోసం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెన్నిస్ స్టార్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోల‌ని నామినేట్ చేసింది.

త‌న‌ని నామినేట్ చేసిన టెడ్రోస్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తూ ఈ ఛాలెంజ్ ప్ర‌జ‌ల ఆరోగ్యంని త‌ప్ప‌క కాపాడుతుందని ట్వీట్ చేసింది.దీనిని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క పాటించాల‌ని పిలుపునిచ్చింది.

మరి దీపికా సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్ పై ఈ స్పోర్ట్ స్టార్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు