- ప్రస్తుత కాలంలో కొందరు కామవాంఛలతో కొట్టుమిట్టాడుతూ ఏం చేస్తున్నామో కూడా ఆలోచించకుండా చేసేటువంటి కొన్ని పనులను చూస్తుంటే ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామని అనిపించకమానదు.తాజాగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి తమ స్నేహితుడితో గొడవపడి అతడిని హతమార్చి చివరికి చనిపోయిన తర్వాత అతనితో శృంగారంలో పాల్గొన్న ఘటన దేశం రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది.
ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను భయాందోళనలకు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు యువకులు పని నిమిత్తమై ఢిల్లీ నగరానికి వలస వచ్చారు.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది.దీంతో ఈ ముగ్గురు కలిసి అప్పుడప్పుడు మద్యం సేవించే వాళ్ళు.అయితే తాజాగా ఈ ఇద్దరు యువకులు కలిసి మూడో వ్యక్తి నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు.ఈ క్రమంలో ముగ్గురు కలిసి మద్యం సేవించారు.
అయితే మద్యం మత్తులో చిన్న విషయానికి ముగ్గురు కలిసి గొడవ పడ్డారు.ఈ గొడవలో బీహార్ కి చెందినటువంటి ఇద్దరు యువకులు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని దారుణంగా హతమార్చారు.
అనంతరం ఇద్దరు యువకులు కలిసి మృతి చెందిన వ్యక్తిపై దారుణంగా అత్యాచారం చేశారు.
అయితే మద్యం మత్తు వదిలాక ఇద్దరూ కలిసి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా మృతుడి సోదరి కంట పడ్డారు.దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ స్థానికులు అప్రమత్తం చేసింది.దీంతో భయపడినటువంటి ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.
అలాగే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అయితే పోస్టుమార్టం అనంతరం వచ్చిన రిపోర్ట్ ద్వారా పోలీసులు యువకుడిపై దారుణంగా అత్యాచారం జరిగినట్లు కనుగొని విస్తుపోయారు.
అలాగే కే బీహార్ పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించగా అప్రమత్తమైన పోలీసులు నిందితులను పాట్నా నగరంలో పట్టుకున్నారు.అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా మద్యం మత్తులో తామే ఇంతటి ఘోరానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు.