వైసీపీ నేతల మధ్య పోరు .. వణికిపోతున్న బాలయ్య

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టుగా తయారయ్యింది ఇప్పుడు హిందూపురం టీడీపీ ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ పని.

ఏపీలో ఫ్యాను గాలి గట్టిగా వీచినా బాలయ్య ఎక్కడా అదరలేదు బెదరలేదు.

టీడీపీ జెండా హిందూపురంలో ఎగురవేశాడు.ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలను నెట్టుకొస్తున్నాడు బాలయ్య.

కానీ వైసిపి ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాలయ్య ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఎక్కడా, ఎవరిమీదా విమర్శలు చేయకుండా, తన పనేదో తాను చేసుకుంటున్నారు.అసెంబ్లీలోనే టిడిపిపై వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేసినా బాలయ్య కనీసం స్పందించలేదు.

ఇప్పుడు వైసీపీతో అనవసర తలనొప్పులు ఎందుకు అన్నట్లుగా బాలయ్య వ్యవహరిస్తున్నాడు.అటువంటి బాలయ్యకు ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Advertisement

నియోజకవర్గం వైపు వెళ్లేందుకు కూడా బాలయ్య వణికిపోతున్నారట.ఇంతకీ బాలయ్యను ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే.? ఇద్దరు వైసిపి నియోజకవర్గ స్థాయి నేతల మధ్య తలెత్తిన వివాదమే దీనికి కారణం.ప్రస్తుతం హిందూపురం వైసీపీ నాయకులు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది.

ఎమ్మెల్సీ అహ్మద్, నవీన్ నిశ్చల్ మధ్య చాలా రోజులుగా ఆధిపత్యపోరు నడుస్తోంది.ఈ క్రమంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఇక్బాల్ స్పందిస్తూ, నవీన్ నిశ్చల్ ఎన్నికల్లో బాలకృష్ణ తో కుమ్మక్కయి పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపణలు చేశారు.దీనిపై నవీన్ నిశ్చల్ స్పందిస్తూ ఇక్బల్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు.

ఇలా ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గంలో ఎవరికి వారు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ కీలక నేతగా తమను తాము చేసుకుంటున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అక్కడితో ఆగకుండా వారిద్దరూ ఇప్పుడు బాలయ్య ను టార్గెట్ చేసుకున్నారు.గతంలోనే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం కి వచ్చిన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కొంతమంది రాజధాని విషయమై టిడిపి అడ్డం పడుతోంది, రాయలసీమ ద్రోహి బాలయ్య అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇప్పుడు మరోసారి బాలయ్య హిందూపురం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం అందడంతో బాలయ్య ను ఇదే విషయంపై నిలదీసేందుకు వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఈ విషయం బాలయ్య వరకు చేరింది.దీంతో నియోజకవర్గానికి వెళ్లేందుకు బాలయ్య వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరి ఆధిపత్య పోరు లో తాను ఇరుకున్నాను అంటే మొదటికే మోసం వస్తుందని బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టిడిపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో మౌనంగానే ఉండడం బెటర్ అని బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది.

మరి ఈ ఇద్దరి వైసీపీ నేతల ఆధిపత్య పోరు ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

తాజా వార్తలు