నారప్ప కోసం క్యూ కట్టిన మరో డైరెక్టర్

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను అనంతపురంలో షూటింగ్ ముగించుకున్న నారప్ప, తన నెక్ట్స్ షెడ్యూ్ల్‌లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీలను కూడా వెంకటేష్ అప్పుడే లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా వెంకటేష్‌ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రాశాడట దర్శకుడు తరుణ్ భాస్కర్.‘పెళ్లి చూపులు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తన సత్తా చాటిన తరుణ్ భాస్కర్, వెంకటేష్‌ను దృష్టిలో పెట్టుకుని గతంలోనే ఓ కథను రెడీ చేశాడు.

అయితే కథలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా వెంకీ సూచించడంతో ఇన్నాళ్లు అదే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.ఇప్పుడు కథ వెంకీకి బాగా నచ్చడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

నారప్ప సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు వెంకీ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించేందుకు సురేష్ బాబు సిద్ధంగా ఉన్నారు.

అటు నారప్ప సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు దర్వకుడు శ్రీకంత్ అడ్డాల.మరి నారప్ప సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు