యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ జాను బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో తన నెక్ట్స్ మూవీలపై ఫోకస్ పెట్టాడు.అయితే తన నెక్ట్స్ మూవీ శ్రీకారం పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించేందుకు శర్వా రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను లైన్‌లో పెట్టేందుకు శర్వా రెడీ అయ్యాడు.
ఈ క్రమంలో గతంలో అందాల భామ సాయి పల్లవితో శర్వా ‘పడి పడి లేచె మనసు’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.
అయితే ఆ సినిమాలో శర్వా, సాయి పల్లవిల పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.దీంతో మరోసారి ఈ జోడి మన ముందుకు రానుంది.దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించేందుకు శర్వా రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
కాగా ప్రస్తుతం కిషోర్ తిరుమల యంగ్ హీరో రామ్ పోతినేనితో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే శర్వాతో సినిమాను ప్రారంభిస్తాడు.ఈ చిత్రం షూటింగ్‌ను మే లేదా జూన్‌లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.పడి పడి లేచె మనసు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయనున్నాడు.







