తమిళనాడులో ఫ్యాన్స్ తో పాటు భక్తులను కూడా సంపాదించుకున్న హీరోల్లో తలపతి విజయ్ ఒకరు.పాత్ర ఏదైనా సరే తలపతి విజయ్ సునాయాసంగా నటిస్తూ ఇప్పటికే పలు రకాల అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.
అయితే తాజాగా విజయ్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్లు తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో విజయ్ ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
దీంతో విజయ్ అభిమానులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ ప్రధాన పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక తలపతి విజయ్ ని రాజకీయాల్లోకి రమ్మంటూ కొందరు అభిమానులు ఆహ్వానిస్తున్నారు.
అయితే ఇదే అదునుగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది.అంతేగాక వచ్చే ఎన్నికలలోపు తమ పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ పలువురు నేతలు ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది.
అంతే కాక ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా.అయితే విజయం మాత్రం అం పలు చిత్రాలతో ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతున్నానని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

అంతేకాక తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావడానికి నీకు ఇంకా టైం ఉందని విజయ్ తో చెప్పడంతో కొంతకాలంపాటు విజయ్ ఆగినట్లు తెలుస్తోంది.అయితే ఏదేమైనప్పటికీ విజయ్ గనుక తమిళ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా నిలదొక్కుకుంటారని అందులో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అయితే మరి భవిష్యత్తులో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడా లేదో చూడాలి.
ఇటీవల కాలంలో విజయ్ నటించినటువంటి బిగిల్ అనే చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అంతే గాక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి వసూళ్లను కూడా సాధించింది.అయితే ప్రస్తుతం విజయ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కంగరాజ్ దర్శకత్వం వహిస్తున్న”మాస్టర్” అనే చిత్రంలో నటిస్తున్నాడు.