బ్యానర్ పేరు మార్చిన కళ్యాణ్ రామ్.. అందుకేనా?

నందమూరి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, అతనొక్కడే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా హిట్ అందుకోలేకపోయాడు.

 Kalyan Ram Changes Ntr Arts Banner Name-TeluguStop.com

పటాస్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌ ఎక్కాడని అనుకునే లోపే వరుసగా ఫ్లాప్ సినిమాలతో మళ్లీ దారితప్పాడు.కాగా ప్రొడ్యూసర్‌గా కూడా మారి కళ్యాణ్ రామ్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

ప్రొడ్యూసర్‌గా కొన్ని సినిమాలు కళ్యాణ్ రామ్‌కు సక్సెస్‌ను అందించాయి.ఇక ఇప్పుడు నిర్మాతగా మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని హారికా అండ్ హాసిని బ్యానర్‌తో కలిసి జాయింట్‌గా ప్రొడ్యూస్ చేస్తు్న్నాడు.కాగా ఈసారి తన బ్యానర్ పేరును మార్చాడు కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే తన బ్యానర్‌ను ఇప్పుడు నందమూరి తారాకరామారావు ఆర్ట్స్ అంటూ మార్చాడు.

గతంలో ఎన్టీఆర్, బసవతారకంల ఫోటో ఉండేది, కానీ ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే పెట్టి బ్యానర్ పేరును ఇంగ్లీష్‌లో పెట్టాడు.

అయితే తమ్ముడు తారక్‌తో కలిసి ఈ బ్యానర్‌ను కళ్యాణ్ రామ్ ఏర్పాటు చేశాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.ఇకపై ఎన్టీఆర్ చేయబోయే సినిమాలన్నింటినీ ఈ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేసేందుకు కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్.

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube