కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్న అక్కినేని సమంత... 

2010వ సంవత్సరంలో అక్కినేని హీరో నాగచైతన్య నటించినటువంటి ఏం మాయ చేశావే చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనటువంటి జెస్సీ- సమంత అక్కినేని గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రల్లో నటిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది అక్కినేని సమంత.

 Akkineni Samantha Latest News About About New Profession-TeluguStop.com

అంతేగాక పాత్ర ఏదైనప్పటికీ చక్కగా ఒదిగిపోయి తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది ఈ భామ.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్టులో కొనసాగుతున్నటువంటి ఈ అమ్మడు వ్యాపారంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

తాజాగా అక్కినేని సమంత పాఠశాలలకు సంబంధించి కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాలని సన్నాహాలు చేస్తోంది.అంతేగాక ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురవా తో పాటూ తనకు ఎంతో సన్నిహితురాలు మరియు స్నేహితురాలు అయినటువంటి శిల్పా రెడ్డి తో కలిసి ఈ వ్యాపారం చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో భాగంగా “ఏకం” అనే లెర్నింగ్ సెంటర్ ని కూడా హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సమంత తన అభిమానులకు తెలిపింది.అయితే ప్రస్తుతం విద్యకి మంచి గిరాకీ ఉండటంతో అక్కినేని సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్లు అయినటువంటి కాజల్ అగర్వాల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మరో పక్క సినిమాల్లో నటిస్తోంది.అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా డా ఫిట్నెస్ సెంటర్ ను నడుపుతూనే మరోపక్క సినిమాల్లో నటిస్తోంది.

ఇప్పుడు సమంత కూడా బిజినెస్ ఉమెన్ అనే టాగ్ తగిలించుకోబోతోంది.

Telugu Tollywood-Movie

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సమంత అక్కినేని కాదల్, కాతు వాకుల రెండు అనే రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.అంతేకాక ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.అయితే ప్రస్తుతం తెలుగులో కూడా ఓ స్టార్ హీరో సరసన నటిస్తున్నట్లు సమాచారం.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube