నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా మారి చేసిన చిత్రం ‘అ!’ అప్పట్లో ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే.ప్రొడ్యూసర్‌గా నాని చేస్తున్న సినిమా కావడం, ఔట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఈ సినిమాలో ఉండటంతో ‘అ’ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉందనే వార్త గతకొంత కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తూ వచ్చింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథను కూడా రెడీ చేశాడంటూ అనేక వార్తలు హల్‌చల్ చేశాయి.అయితే ఈ సీక్వెల్ సినిమా గురించి తాజాగా డిజిటిల్ స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఓ కామెంట్ చేసింది.
దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ’ చిత్రం సీక్వెల్‌పై స్పందించాడు.తాను ‘అ’ చిత్రం సీక్వెల్ కోసం కథను ఎప్పుడో రెడీ చేసి పెట్టానని, తనకు ఆసక్తి ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం లేదని చెప్పుకొచ్చాడు.
అయితే తొలి భాగాన్ని ప్రొడ్యూస్ చేసిన నాని ఈ సీక్వెల్‌ను ఎందుకు ప్రొడ్యూస్ చేయడం లేదనే ప్రశ్న ఇండస్ట్రీ వార్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా వినిపించింది.కాగా తాను సీక్వెల్ చిత్రం కోసం నానిని అడగలేదని, నాని బ్యానర్ వాల్‌పోస్టర్ కొత్త ట్యాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఆయన స్థాపించాడంటూ వెనకేసుకొచ్చాడు ఈ డైరెక్టర్.
మరి అ సీక్వెల్ చిత్రంపై నాని ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.







