చిరును ఫాలో అవుతున్న నితిన్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 Nithiin Follows Megastar Chiranjeevi Style-TeluguStop.com

కాగా తన ప్రతి సినిమాలో తనకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్‌ స్టైల్‌ను అనుకరించే నితిన్, ఇప్పుడు తన పద్ధతి మార్చినట్లు తెలుస్తోంది.

తాజాగా భీష్మ చిత్రంలో సింగిల్స్ యాంతమ్ అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పాటలో నితిన్ ఓ వెరైటీ చొక్కాలో మనకు కనిపిస్తాడు.ఒకవైపు నాలుగు రంగులు ఉన్న ఈ చొక్కా గతంలో మెగాస్టార్ చిరంజీవి విజేత చిత్రంలో ధరించింది.1985లో వచ్చిన విజేత చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు నితిన్ చిరంజీవి స్టైల్‌ను ఫాలో అవుతుండటంతో విజేత చిత్రం స్థాయిలో భీష్మ కూడా సక్సెస్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు.మరి చిరంజీవి స్టైల్‌ను ఫాలో అవుతున్న నితిన్‌ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube