మరో 10 లేదా 20 సంవత్సరాల్లో థియేటర్లు అనేవి కనిపించకుండా పోతాయని, మల్టీప్లెక్స్‌లు ఉంటే అక్కడ అక్కడ ఉండే అవకాశం ఉందని ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మల్టీప్లెక్స్‌లకు కూడా వెళ్లి సినిమాను చూసేంతటి ఓపికను జనాలు కలిగి లేరంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అంటూ అమెజాన్, హాట్ స్టార్, నెట్ప్లిక్స్లు మొదలు అయ్యాయి.ఇక తెలుగు కంటెంట్ ప్రత్యేకం అంటూ అల్లు అరవింద్ ఆహా అంటూ ఒక ఓటీటీని ప్రారంభించాడు.
ఇప్పటికే ఆన్లైన్లో ఇది అందుబాటులో ఉంది.తాజాగా ఆహాకు సంబంధించిన ఒక ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.ఆ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యాడు.ఆహా ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆహాలోని కొన్ని కంటెంట్స్ పిల్లలు చూడకూడనివి కూడా ఉండబోతున్నాయి.వాటిని కాస్త జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టండి.
వాటికి స్పెషల్‌గా పాస్ వర్డ్‌ను ఏర్పాటు చేసుకునేలా చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఆహాలో అడల్డ్ కంటెంట్‌ను పెట్టబోతున్నట్లుగా అల్లు అరవింద్ ప్రకటించాడు.ఆయన డైరెక్ట్‌గానే తెలుగు అడల్ట్ కంటెంట్‌ను కాస్త ఎక్కువగానే ఈ ఆహాలో పెట్టబోతున్నట్లుగా చెప్పడంతో పాటు పిల్లలకు దూరంగా ఉంచాలంటూ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.మార్కెట్లోకి తీసుకు వెళ్లాలి అంటే ఇలాంటి పనులు తప్పవు కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే యూత్‌ను నాశనం చేసేలా ఈ పనులు ఏంటీ అల్లు అరవింద్ అంటూ ప్రశ్నిస్తున్నారు.