ఆ చవకబారు పబ్లిసిటీ వద్దన్న కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వంకు చెందిన కొందరు అధికారులు పబ్లిసిటీ చేసేందుకు సిద్దం అయ్యారు.పలు మాద్యమాల ద్వారా అభివృద్ది కార్యక్రమాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు.

 Kcr Comments On Governament Officials-TeluguStop.com

అదే సమయంలో ఆర్టీసీ బస్సులు మరియు ఇతరత్ర వాహనాలపై కూడా సీఎం కేసీఆర్‌ ఫొటో వేసి ఈ ప్రచారం నిర్వహించాలని అధికారులు భావించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అభివృద్ది మరియు సంక్షేమ పథకాలు అనేవి వారికి అందితే చాలు.

అవే పబ్లిసిటీ అవుతాయి.వాటిని ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదన్నాడు.

చవకబారు పబ్లిసిటీ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వం పరువు పోవడంతో పాటు డబ్బులు వృదా అంటూ కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది.కేసీఆర్‌ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసే విషయమై అధికారులు ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube