పవన్ సినిమాలో రంగమ్మత్త చిందులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా పవన్ ఏకంగా 5 సినిమాలను లైన్‌లో పెట్టినట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.

 Anasuya To Play Key Role In Pawan Kalyan Movie-TeluguStop.com

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాలో హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో తన హాట్ అందాలతో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ, అడపాదడపా చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది.

ఆమె అందంతో పాటు అభినయం కూడా బాగుండటంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతున్నారు.కాగా తాజాగా క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న పవన్ సినిమాలో ఓ కీలకపాత్రను అనసూయతో చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ పాత్ర సినిమా కథకు చాలా ముఖ్యమని, దీని నిడివి 30 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో అనసూయ బంపర్ ఆఫర్ కొట్టిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా అనసూయ చేయబోయే పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాను అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube