తండ్రికి ఇచ్చిన మాట కోసం సీఎం అయ్యాడట

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే చాలా కాలంగా వాళ్ల కుటుంబంలో వస్తున్న ఆనవాయితీకి ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు.

థాక్రే కుటుంబానికి చెందిన వారు ఎవరు కూడా రాజకీయపరమైన పదవులను ఎంపిక చేసుకోకూడదు.

వారు రాజ్యాంగబద్దమైన పదవులకు దూరంగా ఉండాలి.కాని ఆ రూల్‌ను ఉద్దవ్‌ థాక్రే బ్రేక్‌ చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అనేక మంది విమర్శలు చేస్తున్నారు.మీ తండ్రి బాల్‌ థాక్రే ఆశయాలను మీరు తూట్లు పొడిచారు అంటూ కామెంట్స్‌ చేశారు.

తనపై వస్తున్న విమర్శలకు ఉద్దవ్‌ స్పందించారు.తాను నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారమే సీఎం అయ్యాను.

Advertisement

ఆయన కోరికను నెరవేర్చేందుకు నేను సీఎం అయ్యాను అంటూ ప్రకటించారు.నేను ఇంకా ఆయన కోరిక తీర్చలేదు.

ఆ సమయం కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ ఉద్దవ్‌ థాక్రే తాజాగా సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.పెద్ద ఎత్తున తనపై వస్తున్న విమర్శలకు ఆ ఇంటర్వ్యూతో సమాధానం చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు