పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కమ్ బ్యాక్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ తన ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీగా ఉన్నాడట.
ఇప్పటికే ఈ సినిమాకు ఓకే చెప్పిన పవన్ త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది.తమిళ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాకు దర్శకుడిగా క్రిష్‌ను సెలెక్ట్ చేశాడు.
ఈ సినిమాలో పవన్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించేందుకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించి పలు సిట్టింగులు కూడా వేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం క్రిష్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి పవన్ కోసం క్రిష్ కీరవాణి రాగం పలికిస్తున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకోవడానికి క్రిష్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా పవన్ రాజకీయాల కోసం సినిమాలు దూరంగా ఉన్నా, ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ తన ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.







