ఎంత దూకుడుగా అయితే ఏపీ సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో బలం పెంచుకుంటున్నారో అంతే దూకుడుగా జగన్ ను కట్టడి చేసే విధంగా జనసేన వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంపై జనసేన వివిధ అంశాలపై పోరాడినా అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం కాని పెద్దగా తమను పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు తాము జాతీయ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్న కారణంగా తమ బలం అమాంతం పెరిగింది అని జనసేన భావిస్తోంది.
ఇకపై జగన్ ప్రభుత్వం పై దూకుడుగా ప్రజా పోరాటాలను చేయాలని జనసేన ఇప్పటికే నిర్ణయించుకుంది.తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించుకున్నా దానిని పార్లమెంట్ రాజ్యసభ లో అడ్డుకునే విధంగా చేయగలిగితే రాజకీయంగా మరింత బలం పెరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసినా పార్లమెంటులో ఏపీ శాసనమండలి రద్దు బిల్లును ఎప్పుడు ప్రవేశ పెడతారనేది అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది.మండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ బిల్లు ఈ సభల ముందుకు రాకుండా చేయాలని చూస్తున్నారు.అయితే పవన్ మాట బిజెపి పెద్దలు ఎంత వరకు వింటారు అనేది ప్రశ్నగా మారింది.ఎందుకంటే జగన్ తీసుకుని ప్రతి నిర్ణయాన్ని కేంద్రం పెద్దలకు చెప్పే చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

అది కాకుండా మండలి రద్దు వ్యవహారం అమిత్ షా సూచన మేరకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే పవన్ నిర్ణయాన్ని బిజెపి పెద్దగా పట్టించుకోని అవకాశం కనిపించడం లేదు.ఏపీలో కేవలం పార్టీకి బలమైన పునాదులు వేసుకోవడానికే తప్ప జనసేన చెప్పుచేతల్లో బీజేపీ లేదు అనే విషయాన్ని బీజేపీ కూడా చెప్పుకునే ప్రయత్నం తప్పక చేస్తుంది.అదే కనుక జరిగితే రాజకీయంగా జనసేన ఇబ్బందులు పడక తప్పదు.







