తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ద్వజమెత్తాడు.ఎంఐఎంతో కలిసి కేసీఆర్ మతాల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇటీవల బైంసాలో జరిగిన మత ఘర్షణలకు కారణం ఖచ్చితంగా కేసీఆర్ అంటూ కిషన్ రెడ్డి అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎంఐఎంతో కలిసి కేసీఆర్ చేస్తున్న పనుల వల్ల మతాల మద్య గొడవలకు దారి తీస్తుందని ఈ సందర్బంగా కిషన్ రెడ్డి అన్నాడు.
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేశాడు.
ఈ సందర్బంగా కిషన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించాడు.తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడని, ఆయన పాలన ఇకపై అయినా మారకుంటే ప్రజలు బుద్ది చెప్పే సమయం ఆసన్నం అయ్యే అవకాశం ఉందంటూ ఈ సందర్బంగా కిషన్ రెడ్డి హెచ్చరించాడు.