కాకినాడలో ఎమ్మెల్యే వ్యాఖ్యలకి నిరసనగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.శనివారం ఓ సభలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కాకినాడ చేరుకొని ఆందోళన చేశారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.అయితే దీనిపై పోలీసులు జోక్యం చేసుకొని జనసేన నేతలని అరెస్ట్ చేశారు.
దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఎమ్మెల్యే ఇంటి వైపు దూసుకెళ్ళారు.అటు వైపు నుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ ఆందోళనలో కొంత మంది జనసేన కార్యకర్తలకి గాయాలు అయినట్లు తెలుస్తుంది.
ఈ ఘటన నేపధ్యంలో జనసేన కాకినాడ రణరంగంగా మారిందని వినిపిస్తుంది.మరి దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి
.