లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.బాలీవుడ్,కోలీవుడ్,టాలీవుడ్ అన్న తేడా లేకుండా ప్రతి సినిమా ఇండస్ట్రీ లో కూడా ఈ మీటూ ఉద్యమం లో పాల్గొని తమ గోడును వెళ్ళబెట్టుకున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా కూడా తనదైన శైలి లో ఆరోపణలు లేవనెత్తింది.సీనియర్ నటుడు నానా పటేకర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తనుశ్రీ చేసిన ఆరోపణలు పెద్ద సంచలనంగా మారాయి.
ఈ నేపథ్యంలో నానా పటేకర్ కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేసింది అంటూ తనుశ్రీ పై కేసు కూడా నమోదు చేశారు.అయితే ఈ కేసు వాదించడం కోసం అని తనుశ్రీ నితిన్ సత్పుటే అనే లాయర్ ని నియమించుకోగా,అతడు కూడా కామాంధుడే అంటూ మరో మహిళా లాయర్ కేసు పెట్టినట్లు తెలుస్తుంది.
నితిన్ ఒక భూవివాదానికి సంబందించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు, ప్రత్యర్థి మహిళా లాయర్ ను కలిసి మాట్లాడాడట.
ఈ క్రమంలో నితిన్ ఆమె తో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆ మహిళా లాయర్ తాజాగా అతడిపై కేసు పెట్టినట్లు తెలుస్తుంది.
లైంగిక ఆరోపణల నేపథ్యంలో నానా పటేకర్ కు వ్యతిరేకంగా పోరాడాలని పాపం తనుశ్రీ లాయర్ నితిన్ ను నియమించుకుంటే, చివరికి ఇప్పుడు అతడిపై కూడా లైంగిక ఆరోపణలు రావడం గమనార్హం.మరి దీనిపై తనుశ్రీ ఎలా స్పందిస్తుందో,ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.







