సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మహేష్ రెడీ అయ్యాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకున్న కంటెంట్‌లో ఎక్కువ శాతం కామెడీని జోడించి ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించాడు.కాగా ఈ సినిమాలో రెండు ఎపిసోడ్లు సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఒకటి ట్రెయిన్ సీన్ మేజర్ హైలైట్ కానుంది.ఈ సీన్ దాదాపు 30 నిమిషాలపాటు ఉంటుందని, ఈ అరగంటసేపు థియేటర్లో నవ్వులేక కడుపునొప్పి రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా మరో సీన్‌లో వెన్నెల కిషోర్, సుబ్బరాజుల ఎలుక కామెడీ హైలైట్ కానుందట.ఎలుక నేపథ్యంలో సాగే ఈ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనున్నట్లు తెలుస్తోంది.
అటు యాక్షన్ ఇష్టపడే ఆడియెన్స్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు సీన్ హైలైట్ కానుందట.ఈ మూడు సీన్లలో ట్రెయిన్ సీన్, ఎలుక సీన్‌లు కామెడీతో ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలకపాత్రలో నటిస్తోండగా, రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.








