అల వైకుంఠపురములో అవే హైలైట్ అట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల వైకుంఠపురములో ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ముచ్చటగా మూడోసారి జతకడుతున్న బన్నీ ఈ సినిమాతో పాత రికార్డులు తిరగరాయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్.

 Ala Vaikuntapuramulo To Have 3 Highlights-TeluguStop.com

అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాను ఈ కథ పోలి ఉంటుందనే వార్త తెగ వైరల్ అయ్యింది.

అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది.అయితే చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమాలోని సెకండ్ హాఫ్‌లో మూడు హైలైట్స్ ఉండనున్నట్లు, సినిమాకు అవే ప్లస్ పాయింట్స్ కానున్నాయని తెలుస్తోంది.

ప్రీక్లైమాక్స్‌లో వచ్చే కామెడీ సీక్వెన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని తెలుస్తోంది.విలన్-హీరో మధ్య సాగే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరించడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా మూడు హైలైట్లతో అల వైకుంఠపురము సినిమా బన్నీ ఫ్యాన్స్‌కు అసలు సిసలు సంక్రాంతి పండగను అందించడం ఖాయమని తెలుస్తోంది.మరి ఆ హైలైట్లు ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube