హైకోర్టు వస్తే రాజధాని అనాలా ?

బిజెపి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మరోసారి రాజధాని విషయంలో సంచలనాత్మక ఆరోపణలు చేశారు.మొదటి నుంచి జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నసుజనా అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక విషయంపై వైసిపి ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూనే ఉన్నారు.

 Mp Sujana Chowdarycoments On Ap Government Desistions-TeluguStop.com

తాజాగా జగన్ ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే ఉద్దేశ్యంలో ఉండడంతో మరోసారి విమర్శలు చేసారు.కర్నూల్ లో హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఎవరు రాజధాని అన్నారంటూ విమర్శలు చేసారు.

హైదరాబాదులో రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలకు మంచి జరగాలనేదే బీజేపీ ప్రధాన ఆకాంక్ష అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీలో అధికారం ఉంది కాదా అని ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారికి కావాలనుకుంటే భారతి సిమెంట్స్ ను ఇష్టానుసారంగా మార్చుకోవచ్చని, కార్పొరేట్ ఆఫీసును రాష్ట్రంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చని.

రాజధానిని కూడా వారు కార్పొరేట్ సంస్థగా భావిస్తున్నట్టున్నారని సుజనా విమర్శలు చేశారు.జీఎన్ రావు గారు ఒక సెషన్ (బడ్జెట్ సెషన్) వైజాగులో అంటూ నివేదికలో చెప్పారని విమర్శించారు.

రెండేళ్ల వయసున్న పిల్లవాడు కూడా ఇది వింటే నవ్వుతాడని అన్నారు.నా మీద వైసీపీ నాయకులు చేస్తున్నట్టుగా తాను విమర్శలు చేయలేనన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube