ఉస్మానియా యూనివర్సిటీలో విప్లవం రేకెత్తించిన విద్యార్ధి వీరుడు జార్జ్ రెడ్డి గురించి ప్రస్తుతం తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు.దీనిక కారణం జార్జ్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.
ఈ సినిమా టీజర్, ట్రైలర్లు తెలుగు ప్రజల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో మరోసారి విప్లవ విద్యార్ధి నాయకుడి జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలని చూస్తున్న దర్శకనిర్మాత ప్రయత్నాలు అప్పుడే సక్సెస్ సాధించాయని చెప్పొచ్చు.
టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన జార్జ్ రెడ్డి సినిమాకు సినీ ప్రముఖులు సైతం జై కొడుతుండటంతో ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
కాగా ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన సినీ జనాలు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలిచిపోవడం ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.
ఇకపోతే సందీప్ మాధవ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అప్పి రెడ్డి, సంజయ్ రెడ్డి, దాము రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.







