ఒకే రంగంలో ఉండే వారు పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం.అయితే రాజకీయాల్లో కూడా ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది.
రాజకీయ నేతలు కాకపోయినా ఆ నేపధ్యం ఉన్న ఫ్యామిలీ తోనే దాదాపు వియ్యం అందుకుంటూ ఉంటారు.అయితే తాజాగా ఇద్దరు రాజకీయ నేతలు వివాహ బంధం తో ఒక్కటికాబోతున్నారు.
వారిద్దరూ కూడా ఒకే పార్టీ కి చెందిన వారు అయినా, వేరు వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కావడం విశేషం.అయితే ఇప్పుడు వీరి పెళ్లి న్యూస్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే.అదితి సింగ్, పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ షైని.
త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.ఈ జంట వివాహాం నవంబర్ 21న అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం.
వీరి వివాహ రిసెప్షన్ నవంబర్ 23న నిర్వహించనున్నారు.

కాగా వీరిద్దరూ కూడా మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.అంతేకాదు ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం.అంగద్ కంటే అతిధి నాలుగేళ్లు పెద్ద.
అయినప్పటికీ ఇద్దరూ వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు.ఇప్పుడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
కాగా వధూవరుల తండ్రులు కూడా రాజకీయ నేపధ్యం ఉన్నవారే అన్నట్లు సమాచారం.పలుసార్లు చట్టసభలకు వారు ప్రాతినిథ్యం వహించినట్లు తెలుస్తుంది.







