అసలు మీరు ఏం చేస్తున్నారు ? మళ్లీ ప్రశ్నించిన జనసేనాని !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చినా సంతోషం వచ్చిన వెంటనే బయట పెట్టేసుకుంటారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ప్రభుత్వ తీరుపై వరుస వరుసగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

 Janasena Chief Pavan Kalyan Coments On Ysrcp-TeluguStop.com

ఇక ఇసుక విషయంలోనూ అదే విధంగా స్పందించి ప్రభుత్వాన్ని చాలా ఇబ్బందే పట్టారు.ఒకరకంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రలో పవన్ రాజకీయాన్ని నడుపుతూ రాజకీయంగా బలపడేందుకు పునాదులు వేసుకుంటున్నారు.

తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంటే ఏపీలో అధికార భాషా సంఘం ఏం చేస్తుందంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైసీపీ లీడర్లు నేర్చుకోవాలంటూ పవన్ ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు.తెలంగాణలో సీఎం కేసిఆర్ తెలుగు భాషను కాపాడడం కోసం కృషి చేస్తున్నట్టుగా పవన్ ఈ సంధర్భంగా చెప్పుకొచ్చారు.2017లో జరిగిన తెలుగు మహా సభలను గురించి కూడా ప్రస్తావించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు మన భాషా సంస్కృతి భావితరాలకు తెలియదని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube