ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంర్రతి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.చంద్రబాబు నాయుడు పదవి పోయిన తర్వాత ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉందంటూ ఎద్దేవ చేశాడు.
భవన నిర్మాణ కార్మికుల పట్ల మొసలి కన్నీరు కార్చుతూ రాజకీయంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ మంత్రి అన్నాడు.రాష్ట్రాన్ని జీతాలు కూడా ఇవ్వలేని దయనీయమైన స్థితికి తీసుకు వెళ్లాడు అంటూ చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆరోపణలు చేశాడు.
ప్రస్తుతం రాష్ట్రం కాస్త మెరుగు పడిందని జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని మంత్రి అన్నాడు.
భవన నిర్మాణ కార్మికుల కోసం చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్బంగా దీక్ష చేయడం ఏంటీ అంటూ మంత్రి బొత్స ప్రశ్నించాడు.బాబు నీ బుర్ర ఏమైనా చెడిందా, పిల్లలు ఆనందంగా జరుపుకునే బాలల దినోత్సవం రోజు దీక్షలు చేయడం ఏంటీ.
నీ రాజకీయం పరాకాష్టకు చేరింది.అందుకు నిదర్శనం బాలల దినోత్సవం రోజు నీవు చేయబోతున్న దీక్షే అంటూ బొత్స ఎద్దేవ చేశాడు.
తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నట్లుగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోమని ప్రతి విషయంలో కూడా లోతుగా అధ్యయనం చేసి నిర్ణయించుకుంటామంటూ మంత్రి పేర్కొన్నారు.ప్రాజెక్ట్‌లు మరియు రాజధాని విషయంలో కమిటీలు వేశాం.
ఆ విషయాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు.







