ఏపీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గత ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కార్ అవార్డుల పేరుతో అవార్డులు ఇవ్వడం జరిగింది.ప్రతి ఏడాది ఈ ప్రతిభ అవార్డులను ప్రభుత్వం ఇస్తూ వస్తుంది.
అయితే ఈ సంవత్సరానికి గాను అబ్దుల్ కలా ప్రతిభ పురస్కార్ అవార్డులను వైఎస్సార్ విద్యా పురస్కారాల పేరుతో ఇవ్వబోతున్నట్లుగా జీవో విడుదల అయ్యింది.వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో పెద్ద వివాదంకు తెర లేపింది.
రాజకీయ నాయకుల పేర్లను మార్చడం అంటే ఏమో కాని మాజీ రాష్ట్రపతి గొప్ప శాస్త్రవేత్త పేరుతో ఇస్తున్న పురస్కారాల పేరును మార్చడం ఏంటీ అంటూ అంతా విమర్శించడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో విషయంలో సీఎం జగన్ స్పందించారు.
తన దృష్టికి తీసుకు రాకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు.వెంటనే వైఎస్సార్ విద్యా పురస్కారాల పేరుతో వచ్చిన జీవోను రద్దు చేయాలంటూ సీఎం జగన్ ఆదేశించారు.
తనను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం ఏంటీ అంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.అయితే ఈ విషయాన్ని తెలుగు దేశం పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు.
జగన్ కావాలని జీవోను తీసుకు వచ్చాడు.మళ్లీ విమర్శలు రావడంతో వెనక్కు తగ్గాడని, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా నటిస్తున్నాడు అంటూ ఎద్దేవ చేస్తున్నారు.







