టెక్సాస్ రాష్ట్రంలో ఓ జంతు సంరక్షకురాలి ఇంట్లో 150 కుక్కల మృతదేహాలు లభించడం కలకలం రేపింది.దక్షిణ రాష్ట్రంలోని బ్రౌన్స్‌విల్లేకు దగ్గరలోని లాస్ ఫ్రెస్నోస్‌లోని కొందరు స్థానికులకు కుక్కల అరుపులతో పాటు భరించలేని దుర్వాసన రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడి దృశ్యాలు చూసి షాకయ్యారు.కుక్కలు అక్కడ బోనుల్లో బంధించివున్నాయి.వీటిలో 150 కుక్కల వరకు చనిపోయి వున్నాయి.ఆ పంజరాలను మానవ మలమూత్రాలతో నింపేశారు.ఈ ఘటనపై బెనటన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం మంగళవారం ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన జారీ చేసింది.స్టీవెన్ వుడింగ్టన్, టిఫ్ఫానీ వుడింగ్టన్ దంపతులు మిస్సోరి, టెక్సాస్‌లో జంతు సంరక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నారని ఈ రెండింటిలో 300 కుక్కలు, ఇతర జంతువులను గుర్తించామని.
వీటిలో 150 కుక్కలు మరణించగా, మిగిలినవి అత్యంత దయనీయస్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.వుడింగ్టన్ దంపతులతో పాటు కేర్ టేకర్‌గా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిపై కేసులు నమోదు చేసినట్లు బెంటన్ కౌంటీ ప్రకటించింది.







