జార్జియాలో బొల్తాపడిన నౌక: నలుగురు సిబ్బంది గల్లంతు

జార్జియాలో ఒక సరకు రవాణా నౌకలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు.గోల్డెన్ రే అనే కార్గో నౌక ఆదివారం 24 మంది సిబ్బందితో అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళుతుండగా సెయింట్ సైమన్స్ దీవుల సమీపంలో నౌక బొల్తా కొట్టింది.

 Fourcrew Members Are Missing From A Cargo Ship Overturns Neargeorgia-TeluguStop.com

దీంతో సిబ్బంది అంతా నౌక పై భాగానికి చేరి కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు.

Telugu Crew, Cargo Ship, Cargoship, Georgia, Telugu Nri Ups-

  సమాచారం అందుకున్న అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది హెలికాఫ్టర్లు, పడవల సాయంతో 20 మందిని రక్షించారు.అయితే ముగ్గురు క్రూ సిబ్బందితో పాటు పైలట్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.ఈ ముగ్గురిని రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే అప్పటికే నౌక బోల్తా కొట్టడంతో లోపలి భాగంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో వారిని గాలించడం కష్టమైందని కోస్ట్ గార్డ్ కమాండర్ జాన్ రీడ్ మీడియాకు తెలిపారు.

Telugu Crew, Cargo Ship, Cargoship, Georgia, Telugu Nri Ups-

  గల్లంతైన నలుగురి కోసం కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.ప్రమాదానికి గల కారణం ఇప్పటికి తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కోస్ట్‌గార్డ్ గోల్డన్ రే నౌక బొల్తా కొట్టిన ప్రాంతానికి అర మైలు వరకు ఎటువంటి నౌకలను అనుమతించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube