జార్జియాలో బొల్తాపడిన నౌక: నలుగురు సిబ్బంది గల్లంతు

జార్జియాలో ఒక సరకు రవాణా నౌకలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు.

గోల్డెన్ రే అనే కార్గో నౌక ఆదివారం 24 మంది సిబ్బందితో అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళుతుండగా సెయింట్ సైమన్స్ దీవుల సమీపంలో నౌక బొల్తా కొట్టింది.

దీంతో సిబ్బంది అంతా నౌక పై భాగానికి చేరి కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు.

"""/"/  సమాచారం అందుకున్న అమెరికా కోస్ట్‌గార్డ్ సిబ్బంది హెలికాఫ్టర్లు, పడవల సాయంతో 20 మందిని రక్షించారు.

అయితే ముగ్గురు క్రూ సిబ్బందితో పాటు పైలట్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.ఈ ముగ్గురిని రక్షించేందుకు కోస్ట్‌గార్డ్ తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే అప్పటికే నౌక బోల్తా కొట్టడంతో లోపలి భాగంలో మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో వారిని గాలించడం కష్టమైందని కోస్ట్ గార్డ్ కమాండర్ జాన్ రీడ్ మీడియాకు తెలిపారు.

"""/"/  గల్లంతైన నలుగురి కోసం కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.ప్రమాదానికి గల కారణం ఇప్పటికి తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కోస్ట్‌గార్డ్ గోల్డన్ రే నౌక బొల్తా కొట్టిన ప్రాంతానికి అర మైలు వరకు ఎటువంటి నౌకలను అనుమతించడం లేదు.

ఆరోగ్యానికి మంచిద‌ని బ్రౌన్ షుగ‌ర్ తీసుకుంటున్నారా.. అయితే మీరు పెద్ద త‌ప్పే చేస్తున్నారు!