రాజకీయ నిరుద్యోగులకు కేసీఆర్‌ వరం

తెలంగాణలో కేసీఆర్‌ రెండవ సారి అధికారం దక్కించుకుని 9 నెలలు పూర్తి అయ్యింది.ఈ సందర్బంగా ఆయన తన మంత్రి వర్గంను విస్తరించడంతో పాటు గత కొంత కాలంగా ఖాళీగా పడి ఉన్న నామినేటెడ్‌ పదవులను టీఆర్‌ఎస్‌ నాయకులకు కట్టబెట్టేందుకు జీవోలు తీసుకు రాబోతున్నారు.

 Telangana Trs Party Full Fill The Nominated Posts In Trs Partie Leaders-TeluguStop.com

అందుకు సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వ ఉన్నతాధికారులు తయారు చేస్తున్నారు.గతంలో మంత్రి వర్గంలో పని చేసిన వారు, పార్టీ సీనియర్‌ నాయకులు కొందరు ఎమ్మెల్యేగా ఓడిపోవడం లేదంటే కొందరికి కొన్ని కారణాల వల్ల మంత్రి పదవులు దక్కక పోవడం, కొందరు ఎమ్మెల్సీలుగా ఉండటం జరిగింది.

మంత్రి పదవులు దక్కని వారికి ప్రభుత్వంలోకి తీసుకుని వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ భారీగా నామినేటెడ్‌ పదవులకు నియామకంను చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.నామినేటెడ్‌ పదవులు దక్కబోతున్న వారిలో ముఖ్యులు నాయిని, జూపల్లి, పద్మ దేవెందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌ మధుసూదన చారి ఇంకా కొందరికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఆర్టీసి, రైతు సమసన్వయ సమితి చైర్మన్‌ పదవులతో పాటు పలు కార్పోరేషన్‌లకు చైర్మన్‌ పదవులు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube