రామ్‌ జెఠ్మలానీ కన్నుమూత

దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన ఎన్నో హై ప్రొఫైల్‌ కేసులను విచారించిన ఘనత రామ్‌ జెఠ్మలానీకి దక్కుతుంది.తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక నేరం కేసులో జగన్‌ తరపున ఈయనే వాదించాడు.

 Famouslawyer Ram Jethmalani Is No More-TeluguStop.com

ఇంకా ఎంతో మంది రాజకీయ నాయకుల తరపున వకాల్తా పుచ్చుకున్న రామ్‌ జెఠ్మలానీ కేసు టేకాఫ్‌ చేస్తే తిరుగు ఉండదు.అంతటి గుర్తింపు దక్కించుకున్న ఈయన తాజాగా అనారోగ్యంతో కన్నుమూశారు.

దేశంలోనే గొప్ప నాయకుడిగా మరియు లాయర్‌గా పేరు పరపతులు దక్కించుకున్నారు.దాదాపు 500 మంది లాయర్‌లను తయారు చేసిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది.

వేలాది మంది ఆయన శిష్యరికం చేయాలని భావించేవారు.ఆయనకు శిష్యులుగా చేసిన వారు ప్రస్తుతం టాప్‌ లాయర్‌లుగా ఉన్నారు.హైకోర్టులు, సుప్రీం కోర్టుల్లో లాయర్స్‌గా ఉన్నారు.అలాంటి గొప్ప లాయర్‌ అయిన రామ్‌ జెఠ్మలానీ కన్నుమూయడంతో న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.95 ఏళ్ల వయసులో ఉన్న ఆయన గత కొన్నాళ్లుగా నల్ల కోటుకు దూరంగా ఉంటున్నారు.1923, సెప్టెంబర్‌ 14న జన్మించిన ఆయన నేడు అంటే సెప్టెంబర్‌ 8, 2019న మృతి చెందారు.బీజేపీ కీలక నేతగా వ్యవహరించిన రామ్‌ జెఠ్మలానీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube