ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేయడంపై పొరుగుదేశం పాకిస్తాన్ విషం కక్కుతున్న విషయం తెలిసిందే.భారత ప్రభుత్వం కాశ్మీర్ ప్రజల హక్కులను హరిస్తోంది అంటూ గత కొద్దీ రోజులుగా పాక్ దీనిపై పోరాటామంటూ ప్రగల్భాలు పలుకుతున్న నేపథ్యంలో మొదటిసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
కాశ్మీర్ అంశం అనేది భారత అంతర్గత సమస్య అని,ఈ విషయంలో పాక్ తో పాటు మరే ఇతర దేశానికి జోక్యం చేసుకొనే అర్హత లేదని రాహుల్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు.అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ లో అసలు హింసకు పాకిస్థానే కారణమని రాహుల్ మండిపడ్డారు.
‘‘చాలా విషయాల్లో ఈ ప్రభుత్వంతో నేను ఏకీభవించను.కానీ ఈ విషయంలో నేను ఓ స్పష్టతను ఇస్తున్నా.

కాశ్మీర్ అన్నది భారత అంతర్గత సమస్య ఈ విషయంలో పాక్‌తో పాటు మరే ఇతర దేశానికి జోక్యం చేసుకునే అర్హత లేదంటూ రాహుల్ స్పష్టం చేశారు.ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది.ఇది అందరికీ తెలుసు’’ అని అంటూ రాహుల్ ట్వీట్ చేశారు
.






